పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ముందు వరుసలో ఉన్న చిత్రం ‘‘హరిహర వీరమల్లు’‘.పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టినా ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేక పోతున్నాడు.
భీమ్లా నాయక్ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ఈయన తన రాజకీయాలపై పెట్టిన ఫోకస్ సినిమాలపై పెట్టక పోవడంతో ఒక్క సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చెయ్యలేదు.
ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.
అందులో ”హరిహర వీరమల్లు” ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటుంది.కానీ ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.
దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.పవన్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.
ఇప్పటి వరకు సగం కూడా పూర్తి కాలేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అని ఎంత సంబరంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ సినిమా ఆలస్యం మరింత విసుగు తెప్పిస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా లోని సీక్వెన్స్ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ పని చేస్తున్నాడు.తాజాగా ఈయన చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ నిన్న పూర్తి అయ్యింది అని.స్టార్ నటుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తెలిపాడు.పవన్ కళ్యాణ్ పై నిరంతర ప్రేమ, మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తదుపరి యాక్షన్ సీక్వెల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అని తెలిపారు.దీంతో ఈ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఎ దయాకర్ రవి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.