తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

 Another New Scheme Started In Telangana-TeluguStop.com

ఈ మేరకు పథకాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారంతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హాజరైయ్యారు.

కాగా తొమ్మిది జిల్లాల్లో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది.

కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పథకం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తల్లి మనసుతో ఆలోచించి కిట్ ను ప్రారంభించామని తెలిపారు.

రక్తహీనతతో బాధపడుతున్న గర్భీణుల కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు.కిట్ లోని ఖర్జూరపళ్లు, నెయ్యి, ఐరన్ సిరప్, ట్యాబెట్లు, ప్రొటీనులను గర్భిణీలు తప్పకుండా వాడాలని మంత్రి సూచించారు.

ఈ కిట్ ను మొత్తం రెండు సార్లు ఇస్తామని వెల్లడించారు.తల్లి ఆరోగ్యంగానే ఉంటేనే పుట్టబోయే పిల్లలు బాగుంటారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube