సమంత 'ఖుషి' షూట్ లో అప్పుడే పాల్గొనబోతుందట.. మేనేజర్ క్లారిటీ!

సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హెల్త్ ఇష్యుస్ వల్ల ఈమె ఇండియాలోనే బాగా పాపులర్ అయ్యింది.

 Samantha Manager Has Given Clarity On Rumours Details, Samantha, Vijay Deverakon-TeluguStop.com

పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టింది.

వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్న సమయంలోనే ఈమె అనారోగ్యం పాలు అయ్యింది.దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది.

ఈమె అనారోగ్యానికి గురి అయినప్పటి నుండే ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోతున్నాయి.ఈ క్రమంలోనే రోజుకొక రూమర్ కూడా వినిపిస్తుంది.ఈమె నటించే సినిమాలు ఈమె లేని కారణంగా షూటింగ్ డిలే అవుతూ వస్తున్నాయి.దీంతో ఈమెను బాలీవుడ్ సినిమాల నుండి తప్పిస్తున్నారు.

కొత్త వారిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉన్నారంటూ వచ్చే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Telugu Shiva Nirvana, Kushi, Samantha, Samantha Khushi-Movie

ఈ క్రమంలోనే ఈమె నటించే సినిమాల గురించి సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.ఈ రూమర్స్ అన్ని కూడా మీడియా సృష్టి మాత్రమే అని సామ్ సంక్రాంతి తర్వాత నుండి సమంత ఖుషి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది అని తెలిపారు.ఈ సినిమా పూర్తి అయిన తర్వాత హిందీ సినిమా షూట్ లో పాల్గొన బోతుంది అని చెప్పుకొచ్చారు.

సామ్ తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇస్తామని చెప్పిన నిర్మాతలు ఒప్పుకోలేదని ఈ వార్తలన్నీ అబద్ధం అని చెప్పుకొచ్చారు.దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది.

Telugu Shiva Nirvana, Kushi, Samantha, Samantha Khushi-Movie

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో వీరిద్దరి జోడీ ఫ్రెష్ గా అనిపిస్తుందో అనడంలో ఎలాంటి సందేహం లేదు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube