ప్రముఖ టాలీవుడ్ నటుడు భరత్ రెడ్డి సినిమాల్లో యాక్టర్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో డాక్టర్ కావడం గమనార్హం.తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన భరత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో తనకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని తెలిపారు.
రియల్ లైఫ్ లో డాక్టర్ అయిన భరత్ రెడ్డి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో డాక్టర్ రోల్స్ లో కనిపించి మెప్పించడం గమనార్హం.
విధిరాతను ఎవరూ మార్చలేరని అందుకే నేను సినిమాల్లోకి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.
నేను సినిమాల్లోకి వెళితే డాక్టర్ గా కెరీర్ నాశనం అవుతుందని చాలామంది చెప్పారని ఆయన తెలిపారు.డాక్టర్ గా, యాక్టర్ గా కెరీర్ ను కొనసాగించడం సులువు కాదని భరత్ రెడ్డి తెలిపారు.
సిద్ధం మూవీతో నాకు కెరీర్ పరంగా బ్రేక్ వచ్చిందని ఈనాడు సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.దృశ్యం సినిమాలో హైట్ వల్ల అవకాశం కోల్పోయానని ఆయన అన్నారు.శ్రీమంతుడు మూవీలో నేను పోషించాల్సిన పాత్రలో రాహుల్ రవీంద్రన్ చేశారని భరత్ రెడ్డి పేర్కొన్నారు.
నాకు అడ్వాన్స్ ఇచ్చినా ఆ సినిమాలో నాకు ఛాన్స్ పోయిందని ఆయన వెల్లడించారు.ఈ విధంగా ఛాన్స్ లు పోవడం ఎన్నో అనుభవాలను నేర్పిస్తుందని భరత్ రెడ్డి తెలిపారు.

అమ్మ కోరిక మేరకు డాక్టర్ అయ్యానని సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి అని ఆయన కామెంట్లు చేశారు.ఒక విచిత్రం సినిమాతో కెరీర్ మొదలైందని భరత్ రెడ్డి అన్నారు.రాఖీ సినిమాలో తారక్ తో ఒకే ఒక్క సీన్ లో కలిసి నటించానని ఆయన తెలిపారు.నాగ్ సార్ అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించానని భరత్ రెడ్డి పేర్కొన్నారు.







