తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.డ్రగ్స్ టెస్టు కోసం రక్తంతో పాటు కిడ్నీ కూడా ఇస్తానన్నారు.
డ్రగ్స్ టెస్టు నుంచి క్లీన్ చిట్ తో బయటకు వస్తా అని చెప్పారు.తనపై విమర్శలు చేసిన బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తాలో తన చెప్పుతో తానే కొట్టుకుంటారా అని నిలదీశారు.
సిరిసిల్లలోనే ఉంటా డాక్టరును తీసుకురా అంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
వేట కుక్కల్లాంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు.మోదీ, ఈడీ ఎవరైనా రావచ్చు.
ఏమైనా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.పనికి మాలిన రాజకీయాలు తాము చేయమన్న కేటీఆర్ మోదీ కూడా డ్రగ్స్ టెస్టు కోసం బ్లడ్ శాంపిల్స్ ఇస్తారా అని ప్రశ్నించారు.







