తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.ఇకపోతే తాజాగా ఈయన యంగ్ హీరో విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈయన పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతున్నాయి.విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలోనే ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి ఈయన మాట్లాడుతూ.
తాను గత ఎనిమిది సంవత్సరాలుగా తన ఫ్యామిలీ సినిమాలకు తప్ప ఇతర సినిమాల వేడుకలకు హాజరు కాలేదని తెలిపారు.
అయితే విశాల్ అంకుల్ తిరుపతిలో సినిమా ఈవెన్ ప్లాన్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలి అని అడగడంతో వెంటనే ఓకే చెప్పానని మోహన్ బాబు వెల్లడించారు.ఇక ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో గౌరవం ఉందని తెలిపారు.సమాజంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకు సంబంధించిన నిజా నిజాలు వారికే తెలుస్తాయని ఈయన తెలియజేశారు.సమాజంలో ఎంతో గౌరవింపబడిన పోలీసులు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారంటూ ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ తీవ్రదుమారం రేపుతున్నాయి.ఐఏఎస్ ఐపీఎస్ ల నుంచి మొదలుకొని పోలీసులందరూ కూడా ప్రభుత్వానికి కొమ్ముకాయడం తనకు చాలా బాధ కలిగిస్తోందని ఈ సందర్భంగా మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







