నానాటికీ పెరిగిపోతున్న టెక్నాలజీ మంచితో పాటు చెడుని కూడా చేస్తోంది.చాలామంది సైబర్ కేటుగాళ్లు టెక్నాలజీలో బొక్కలను వాడుకొని సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు తప్పనిసరి కావడంతో ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరిపోయింది.మనం ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొన్నిసార్లు రికార్డు అవుతుండటం సహజంగా జరిగిపోతుంది.
కొన్నిసార్లు అది మనకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది.అయితే వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు ఎదుటివారితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో బీప్ సౌండ్ వినబడితే మీ సంభాషణ రికార్డ్ అవుతుందని అర్ధం చేసుకోండి.లేకపోతే, మీరు ఇన్‌కమింగ్ కాల్ లిఫ్ట్ చేయగానే లాంగ్ బీప్ సౌండ్ వస్తే కాల్ రికార్డింగ్ అవుతుందని అర్ధం.
అలాంటప్పుడు వెంటనే ఫోన్ కట్ చెయ్యడం మంచిది.ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న ఫోన్లు సరికొత్త ఫీచర్లను అందిస్తున్నాయి.కొత్త మొబైల్ ఫోన్స్ నుంచి కాల్ రికార్డింగ్ చేస్తే, మీరు కాల్ రికార్డింగ్ అనౌన్స్‌మెంట్ వినే వెసులుబాటు వుంది.ఇది వినడం ద్వారా కూడా అవతలి వైపు వ్యక్తి మీ కాల్‌ని రికార్డ్ చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు.

ఇక కొన్ని దేశాల్లో అయితే కాల్ రికార్డింగ్ అనేది చట్ట విరుద్ధం.ఈ కారణంగా కాల్‌లను Google, థర్డ్ పార్టీ యాప్ ద్వారా రికార్డ్ చేయడం అనేది అక్కడ సాధ్యం కాదు.కానీ మన ఇండియాలో అది సాధ్యం అని అందరికీ తెలిసిందే.ఇద్దరు వ్యక్తులు మాట్లాడే సంభాషణ రికార్డ్ చేస్తే అది కాల్ రికార్డింగ్ అని, సంబంధం లేని వ్యక్తి రికార్డింగ్ చేస్తే అది టాపింగ్ అని అంటారనే విషయం మీకు తెలుసా? సైబర్ నేరుగాల్లు వీటి ద్వారా ఇపుడు డబ్బు చేసుకుంటున్నారు.అలాంటి సిగ్నల్స్ మీకు ఎదురైనపుడు జాగ్రత్త పడటం మంచిది.ఇప్పుడు స్పామ్ కాల్స్ పేరుతో చాలామంది డబ్బులను కొల్లగొడుతున్నారు.







