మీ వాహనానికి ఈ సిరీస్‌ నంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?

వాహనదారులు ఎంతకాలంనుండో ఎదురు చూస్తున్న BH సిరీస్ నంబర్ ప్లేట్ ఇన్‌స్టాల్ విషయమై తాజాగా ఓ శుభవార్త వెలువడింది.దీని ప్రకగం మీరు మీ పాత కారులో కూడా BH (భారత్ సిరీస్) నంబర్ ప్లేట్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

 With Bh Series Number Plate You Travel Anywhere In India Details, Travel, Bh Ser-TeluguStop.com

అవును, BH సిరీస్ పర్యావరణ వ్యవస్థను విస్తృతం చేసే నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సాధారణ వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్లను భారత్ సిరీస్ నంబర్‌లుగా మార్చడానికి అనుమతి ఇచ్చింది.ఇప్పటి వరకు కొత్త వాహనాలు మాత్రమే BH సిరీస్ నంబర్ ప్లేట్‌లను ఎంచుకొనే వీలుంది.

కాగా నేటితో ఇవి ఎవరన్నా సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇందుకు అవసరమైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా పౌరుల సౌకర్యార్థం మంత్రిత్వ శాఖ రూల్ 48లో సవరణను ప్రతిపాదించడం గమనార్హం.రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీ కోసం రోడ్ల మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో BH నంబర్ సిరీస్‌ను ఆరంభించింది.

ఈ నంబర్ ప్లేట్‌తో, వాహన యజమానులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయబడినప్పుడు వారికి రీ-రిజిస్ట్రేషన్ అనేది మరలా అవసరం లేదు.BH సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్‌లను ప్రవేశపెట్టడానికి ముందు, ఏదైనా వాహనాన్ని మరలా నమోదు చేసుకోవలసి ఉంటుంది.

ఇక్కడ డ్రైవర్ కూడా తన రోడ్డు పన్ను చెల్లించాలి.అయితే, కొత్త సిరీస్ ఇప్పటి వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకే పరిమితమైంది.ఈ తాజా నిర్ణయంతో, మీరు పాత కార్లకు కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్‌లను పొందవచ్చు.రక్షణ రంగం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు BH నంబర్ కోసం దరఖాస్తు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

ఇది కాకుండా, దేశంలోని నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉన్న బహుళజాతి కంపెనీ కూడా దానికోసం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube