ఇది రేవంత్ కాంగ్రెసమ్మ ! ఇక వారి పప్పులుడకవ్ ! 

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీన్ మారిపోయింది.ఇప్పటి వరకు తమ సీనియారిటీ ని అడ్డం పెట్టుకుని హై కమాండ్ వద్ద బెదిరింపు ధోరణితో వ్యవహరించిన సీనియర్లకు చెక్ పడిపోయింది.

 Aicc President Mallikarjuna Kharge Full Powers To Tpcc Chief Revanth Reddy Detai-TeluguStop.com

తెలంగాణ కాంగ్రెస్ లో అంత తామే అన్నట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేతల తీరు పై గత కొంతకాలంగా ఆ పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతుంది.కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి కారణం గ్రూపు రాజకీయాలేనని , వాటికి చెక్ పెట్టకపోతే ఇక పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించారు.

ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో క్లారిటీతో ఉన్నారు.

అందుకే తెలంగాణ సీనియర్ నాయకుల కంటే పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురాగలరు అనే నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా పగ్గాలు అప్పగించేశారు.

రేవంత్ వర్గానికి పెద్దపీట వేస్తూనే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ కమిటీలను నియమించారు.ఆ నియామకాల పైన సీనియర్లు అసంతృప్తితో ఉన్నా,  అధిష్టానం సైతం వారిని పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు.

ఇటీవల ప్రకటించిన టి.పిసిసి కమిటీలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించాలని అధిష్టానం ఆదేశించడంతో రేవంత్ రెడ్డి వాటిని నిర్వహించారు.ఈ సమావేశాలకు రేవంత్ తో విభేదిస్తున్న కొంతమంది సీనియర్లు హాజరు కాలేదు.

Telugu Aicc, India Congress, Pcc, Revanth Reddy-Political

మిగతా వారంతా హాజరు కావడంతో,  ఆ తొమ్మిది మంది మినహా మిగిలిన వారంతా రేవంత్ వైపు ఉన్నారనే విషయం అర్థం అయిపోయింది.ఇక రానున్న రోజుల్లోనూ రేవంత్ పై ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ సీనియర్ అసంతృప్త నేతల మాట వినే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో పాటు వారికి అధిష్టానం వద్ద  అంత ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపించడం లేదు.

వీరంతా రేవంత్ టీమ్ పై టీడీపీ ముద్రవేసే ప్రయత్నం చేస్తూ , సొంత పార్టీని దెబ్బతీస్తున్నారని అధిష్టానం ఆగ్రహంగా ఉంది.దీంతో పాటు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నా సీనియర్ నాయకులు బిజెపిలోకి వెళ్లే ప్రయత్నం లో భాగంగానే కాంగ్రెస్ లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావిస్తుండడంతోనే, పూర్తిగా రేవంత్ చేతుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ ను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

     

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube