న్యాచురల్ నాని మరోసారి సాహసం చేస్తున్నాడు.కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే నాని ప్రస్తుతం చేస్తున్న దసరా, హిట్ 3 తర్వాత మరో కొత్త దర్శకుడితో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన సివి మోహన్ నిర్మాతగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.ఈ సినిమా కథ మొత్తం అమెరికాలో జరుగుతుందట.
ఇంట్రెస్టింగ్ స్టోరీతో రావడంతో నాని వెంటనే ఈ సినిమాకు ఓకే చేశాడని తెలుస్తుంది.
నాని దసరా సినిమా వచ్చే ఏడాది మార్చ్ 30న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా నాని కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది.సినిమా లో నాని ఊర మాస్ లుక్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.
పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న దసరా నాని రేంజ్ పెంచుతుందని భావిస్తున్నారు.ఇక నాని తన నిర్మాణంలో వస్తున్న హిట్ ఫ్రాంచైజ్ మూడవ కేస్ హిట్ 3లో కూడా నటిస్తున్నాడు.
హిట్ 3 తర్వాత ఈ కొత్త దర్శకుడి సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఫారిన్ లోనే మొత్తం షూటింగ్ అంటున్నారు అంటే నాని ఈసారి ఓ పర్ఫెక్ట్ హిట్ స్టోరీనే దక్కించుకున్నాడని అనిపిస్తుంది.







