చిత్ర పరిశ్రమలో నిర్మాతగా,నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.ఇలా తరచు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.
ఇక సినిమాకు సంబంధించిన విషయాల గురించే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలపై కూడా బండ్ల గణేష్ స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి రామోజీరావును ఉద్దేశించి పలు ట్వీట్స్ చేశారు.
ఈ క్రమంలోనే రామోజీరావు గురించి సంచలన ట్వీట్లు చేయడమే కాకుండా, ఈయన ఏడుపుగొట్టు వార్తల వెనక ప్రజలకు మేలు జరగాలన్న ఆరాటం జీరో.కుల ప్రయోజనాలు, వ్యాపారాలు, చుట్టాల కాంట్రాక్టులు, భూములు కాపాడుకోవడమే తన ఉద్దేశమని,జర్నలిజం, విలువలు అన్నీ ఫేకులు, బొంకులే.
ఏది అచ్చేసినా జనం గుడ్డిగా నమ్ముతారన్న భ్రమలో జీవిస్తున్నాడంటూ రామోజీరావు గురించి విజయసాయిరెడ్డి ఎన్నో వివాదాస్పద వరుస త్వీట్లు చేశారు.

ఇలా విజయసాయిరెడ్డి రామోజీరావు గురించి చేసిన ప్రతి ఒక్క ట్వీట్ కి బండ్ల గణేష్ రిప్లై ఇస్తున్నారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ విజయ్ సాయి రెడ్డిని ఉద్దేశిస్తూ.ప్రతిరోజు మీకు మంచి సలహాలు సూచనలు తెలియజేస్తాను మిమ్మల్ని ఒక మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతాను అంటూ బండ్ల గణేష్ విజయసాయి రెడ్డికి రీ ట్వీట్ ఇచ్చారు.
అయితే గతంలోనూ వీరిద్దరి మధ్య ఇలాంటి వివాదాస్పదమైన సంఘటనలు ఎన్నో జరిగాయి.తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య ఇలాంటి చర్చలు జరగడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.







