తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై ఏఐసీసీ ఆరా తీసేందుకు సిద్ధమైంది.గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.
కమిటీల ప్రకటనతో పార్టీలో సీనియర్ నేతల మధ్య, పీసీసీ చీఫ్‌కు చెందిన వర్గానికి మధ్య వివాదం కొనసాగుతుంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో పరిణామాలపై మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ ను ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అసంతృప్తితో ఉన్న సీనియర్లతో భేటీ కావాలని నదీమ్ జావిద్ కు ఆదేశాలు జారీ చేసారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ, మహేశ్వర్ రెడ్డితో పాటు జగ్గారెడ్డిలతో జావిద్ సమావేశం కానున్నారు.







