మనుషులు సాధారణంగా తెలివైనవారు కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమకు కావల్సిన విధంగా సదుపాయాలను సమకూర్చుకొని జీవనాన్ని సౌకర్యవంతంగా సాగిస్తూ వుంటారు.ముఖ్యంగా చలికాలంలో తీవ్రమైన చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు, జర్కీన్‌లు వాడుతూ వుంటారు.
కానీ తెలివిలేని మూగ జీవాల పరిస్థితి ఏమిటి? ఎపుడైనా ఆలోచించారా? అలాంటి ఆలోచనే మనం చేయము కదూ.కొన్ని చోట్ల ఇళ్లల్లో మరీ ఎక్కువగా చలి ఉంటే హీటర్లు కూడా వాడుతారు.కాని జంతువుల గురించే ఎవరన్నా పట్టించుకుంటరా?
ఎవరు పట్టించుకోరు కదూ.కాని ఓడిశాలోని ఓ జూలో మాత్రం జంతువులకు శీతాకాలంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు.అవును, ఒడిశాలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్కు అధికారులు జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ జంతు ప్రదర్శన శాలలో చింపాంజీలకు ప్లైవుడ్ తో రూం ఏర్పాటు చేసి, అందులో హీటర్లు ఏర్పాటు చేసారు.
బాగా చలిగా ఉన్నప్పుడు హీటర్లు ఆన్ చేయడం ద్వారా చింపాజీలు చలికి వణికిపోకుండా రక్షణ పొందుతాయి.

జూ అధికారులు అక్కడ జంతువు స్వభావాన్ని బట్టి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.జంతువుల స్వభావం ఒకేలా ఉండదు.అందుకు ఈ జూలో జంతువుల స్వభావం ఆధారంగా వాటిని స్పెషల్‌గా ట్రీట్ చేయడం విశేషం.
దీనిలో భాగంగా ఒరంగుటాన్‌లకు వెచ్చగా ఉంచేందుకు దుప్పట్లు అందించారు అధికారులు.ఒరంగుటాన్ అనేవి ఒక రకమైన కోతుల జాతికి చెందినవి.
ఇది ఎక్కువుగా మలేషియా, ఇండోనేషియా ప్రాంతాల్లో నివసిస్తాయి.అలాగే అక్కడి కొండచిలువల కోసం దాని చుట్టుపక్కల వరి గడ్డిని అందుబాటులో ఉంచారు.
అలాగే విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రాకు ప్రకాశించే బల్బులను అమర్చారు.







