ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.ఈసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత తనదని చెప్పారు.
మంత్రి అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమన్నారు.మీరు నోరు పారేసుకుంటే తాను కూడా నోటికి పని చెప్తానంటూ వ్యాఖ్యనించారు.
తనను పీకేస్తే మళ్లీ మొలుస్తానన్న పవన్ తొక్కేస్తే మళ్లీ లేస్తానన్నారు.కావాలనే కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని పవన్ ఎద్దేవా చేశారు.ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తోందన్నారు.
బీసీ హాస్టళ్లలో చారు మట్టి నీళ్లతో సమానమని పేర్కొన్నారు.బీసీ సాధికారత అంటే హాస్టళ్లలో సౌకర్యాలు పెంచడం, ఫీజు రియింబర్స్ మెంట్ చేయడమని వెల్లడించారు.
బిర్యానీకి, రొయ్యల వేపుడుకు బీసీలు అమ్ముడుపోరని పవన్ స్పష్టం చేశారు.బీజేపీకి, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే మాటకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.







