5 స్టార్ హోటల్‌ని తలపించే రైలు.. టికెట్ ధర అక్షరాలా రూ.19 లక్షలు

మనమంతా ఏదో ఒక సందర్భంలో రైలులో ప్రయాణించి ఉంటాం.మనం వెళ్లే దూరాన్ని బట్టి టికెట్ ధర రూ.

 A Train Reminiscent Of A 5 Star Hotel. The Ticket Price Is Rs.19 Lakhs, 5 Star-TeluguStop.com

వందల్లో, బాగా దైరం అయితే రూ.వేలల్లో ఉంటుంది.చాలామంది ఇప్పటికీ రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు.ఎందుకంటే ఇది ఇప్పటికీ చౌకైన, సురక్షితమైన రవాణా విధానం.కానీ, రైళ్లు ఇకపై చౌకైన రవాణా మార్గం కానట్లు కనిపిస్తోంది.కారణం మహారాజాస్ ఎక్స్‌ప్రెస్.ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న దీని ప్రయాణానికి రూ.19 లక్షలు ఖర్చవుతుంది.ఈ ఎక్స్‌ప్రెస్ విలాసవంతమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ గురించి అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలిలా ఉన్నాయి.“మహారాజాస్’ ఎక్స్‌ప్రెస్ తన అతిథుల కోసం ఆ ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది.భారతదేశంలోని అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించేటప్పుడు అది గుర్తుండిపోయేలా ఈ ప్రయాణం చేస్తుంది.

ఈ రైలులో ఒక ప్రయాణికుడు నాలుగు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.ఇండియన్ పనోరోమా, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇలా నాలుగు రకాలు ఉంటాయి.

ఏది ఎంచుకున్నా ప్రయాణం 7 రోజులు ఉంటుంది.

టికె్ ఖరీదు మాత్రం రూ.19 లక్షలు చెల్లించాలి.ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు, కుశాగ్రా మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రెసిడెన్షియల్ సూట్‌లలో ఒకదాని వీడియోను పంచుకున్నారు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

సూట్ ఒకే రైల్వే కోచ్ పరిమాణంలో ఉంటుంది.షవర్‌తో కూడిన బాత్రూమ్, డైనింగ్ స్పేస్‌, రెండు మాస్టర్ బెడ్‌రూమ్‌లను కలిగి ఉంటుంది.అదనంగా, ప్రత్యేకమైన బట్లర్ సేవ, కాంప్లిమెంటరీ మినీ బార్, ఎయిర్ కండిషనింగ్, Wi-Fi ఇంటర్నెట్, డీవీడీ ప్లేయర్‌లతో సహా లైవ్ టెలివిజన్ ఇలా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి.అయితే టికెట్ ధర విని అంతా ఆశ్చర్యపోతున్నారు.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.రూ.19 లక్షలు ఉంటే మధ్య తరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవచ్చని, విదేశాలకు వెళ్లి రావొచ్చని కామెంట్లు పెడుతున్నారు.

Maharajas Express Expensive Train in India worth Rs Lakhs

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube