సాధారణంగా ఎలుగుబంటిని ఎవరూ పెంచుకోరు కానీ ఒక వ్యక్తి పెంచుకోవడం స్టార్ట్ చేశాడు.అయితే అది కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం చూపుతూ తన యజమానిని ప్రేమిస్తోంది.
అంతేకాదు తన యజమానిని భార్య తప్ప ఇంకెవరైనా సరే ముట్టుకుంటే అది బాగా కోప్పడుతోంది.మనిషిలాగా అసూయ చూపిస్తూ తన ప్రేమను ఓనర్ పట్ల చాటుతోంది.
వివరాల్లోకి వెళితే, కెనడాకు చెందిన నిమల్ ట్రైనర్ మార్క్ అబోట్ డుమాస్ ఒక ఎలుగుబంటికి పెంచుకుంటున్నాడు.ఇప్పటికే అతను ఎలుగుబంటితో షేర్ చేసుకునే మంచి అనుబంధం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ ఎలుగుబంటితో ఉన్న తన ప్రత్యేక బంధం గురించి అతను మరోసారి వార్తలో నిలిచాడు.
మార్క్, అతని భార్య డాన్ కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఎలుగుబంటిని దత్తత తీసుకున్నారు.
ఆ ఎలుగుబంటికి మార్క్ తన భార్యని కాకుండా వేరే ఆడవారిని ఎవరినైనా కలిసినా లేదా మాట్లాడినా వెంటనే కోపం వస్తుందట.ఈ విషయాన్ని మార్క్ వైఫ్ డాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం ఆ వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ ధ్రువపు ఎలుగుబంటికి 8 వారల వయసు వున్నపుడు జంతు శిక్షకుడు మార్క్ డుమస్ దత్తత తీసుకొని పెంచడం ప్రారంభించాడు.
అది ఒక ఆడ ఎలుగుబంటి.దానికి ఏజీ అనే పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు.
అది వేరే ఆడవాళ్లను చూస్తే అసూయపడుతుంది అని మార్క్ భార్య డాన్ ఇంటర్వ్యూలో వివరించారు.

వారి పెంపుడు జంతువు అయిన ఆ ధ్రువపు ఎలుగుబంటి గురించి మార్క్ వివరిస్తూ ‘ఎవరైనా నాతో మాట్లాడుతున్నపుడు, అలానే నేను ఆమెపై నుండి దృష్టి ని మరల్చినపుడు ఎలుగుబంటి ఎంతగానో బాధపడుతుంది’ అని చెప్పారు.మార్క్, డాన్‌లను ఇంటర్వ్యూ చేసిన తరువాత జర్నలిస్ట్ ఆ ధ్రువపు ఎలుగుబంటి ఏజీని కలిసే ప్రయత్నం చేస్తుంది.ఆ సమయంలో ఏజీ జర్నలిస్ట్‌ని చూసి గట్టిగా గర్జన లాంటి శబ్దం చేస్తుంది.
ఇంతలోనే డాన్ ‘నేను మీ అభిమాని’ అని చెప్పి ఆ ఎలుగుబంటిని కూల్ చేసింది.







