పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు చర్యలకు సిద్ధమైయ్యారని తెలుస్తోంది.ఇందులో భాగంగా దాడులపై రెండు ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేసారు.
హత్యాయత్నం సెక్షన్ కింద ఒక ఎఫ్ఐఆర్ ను, ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేయడంపై మరో కేసును నమోదు చేశారని సమాచారం.ఈ క్రమంలోనే నిన్నటి ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు.
సీసీ టీవీ ఫుటేజ్, వీడియో క్లిప్పింగుల ద్వారా నిందితులను గుర్తించారు.అంతేకాకుండా గొడవలకు కారణమైన నేతలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.