ఏ రాజకీయ నాయకుడిను అయినా ఒక మంచి పని చేస్తే… తరాలు మారినా ప్రజలు తల మీద పెట్టుకొని పూజిస్తారు.సొంత ఇంటి పట్టాలు, ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటి వల్ల వైఎస్సార్ మేనియా ఇప్పటికీ కొనసాగుతుండడం దానికి పెద్ద ఉదాహరణ.
ఇక విషయానికి వస్తే… ఇరవై సంవత్సరాల క్రితం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైదరాబాద్‌లో నెలకొల్పారు.ఇక వారు 20వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ టాప్ బిజినెస్ స్కూల్ దాని దాని స్థాపనకు ఎంతో కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడిని కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆహ్వానించి గౌరవించింది.
ISB వ్యవస్థాపక డీన్… తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ‘‘చంద్రబాబు నాయుడు గారితో వేదిక పంచుకున్న ప్రతిసారీ నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను.నాకు, అతను ఒక సంపూర్ణమైన రోల్ మోడల్ మరియు నేను చాలా మంది రాజకీయ నాయకులను చూశాను, కానీ చంద్రబాబు నాయుడు వేరే.
ఆయన వంటి వారు చాలా అరుదు.ఇక మనం ఇవ్వగలిగే అన్ని గౌరవాలకు ఆయనా సర్వత్రా అర్హుడు.
ఆయనతో పరిచయం నాకు ఒక బహుమతిగా, గౌరవంగా భావిస్తున్నాను” అని ప్రమత్ రాజ్ సిన్హా అన్నారు.

ISB డీన్ పై వ్యాఖ్యలతో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.అలాగే హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేసిన పనులకు సైతం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.ఇప్పుడు ఆయన నెట్టింట ఎలివేట్ అవుతున్నాడు.
విజన్ 2020 ద్వారా పెట్టుబడులు, టెక్ కంపెనీలు నగరంలో తమ ఉనికిని ఏర్పరచుకోవడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలని నాయుడుగారి ఆలోచన.అందులో నాయుడు కృషి నిజంగానే ఫలించింది, ఇన్నేళ్లుగా హైదరాబాద్ చూసిన అభివృద్దే దానికి నిదర్శనం అంటూ ఎంతో మంది ఎన్నో కామెంట్లు వేశారు.
ISB లో, ఇన్‌స్టిట్యూట్ స్థాపించినప్పుడు తాను నాటిన చీజ్‌వుడ్ మొక్కను కూడా చంద్రబాబు సందర్శించారు.అలాగే ఇంటరాక్టివ్ సెషన్‌లో బాబు మాట్లాడుతూ ఐఎస్‌బిలో ఉద్యోగార్ధులు కాకుండా ఉద్యోగ ప్రదాతలు కావాలని చంద్రబాబు కోరారు.
ఆయన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది.అదే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

ఏదైనా చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లో బాగా గడ్డు కాలం ఎదురుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన టెక్నాలజీ రంగంలో తెచ్చిన మార్పులు, ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే అభివృద్ధికి చేసిన కృషిని జనాలు బాగానే గుర్తుపెట్టుకున్నారు.







