మా నియోజకవర్గంలో ఇది సార్ పరిస్థితి ! వైసీపీ ఎమ్మెల్యే ల ఆవేదన ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పదేపదే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.పనితీరు మార్చుకోవాలని, పనితీరు సక్రమంగా లేని వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అని తేల్చి చెబుతున్నారు.

 Sir, This Is The Situation In Our Constituency! The Anguish Of Ycp Mlas,ysrcp, A-TeluguStop.com

ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్న జగన్ ఈ స్థాయిలో ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని,  నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని పదేపదే వైసిపి ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు.

ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేదని , పార్టీ నాయకులంతా జనాల్లో ఉంటూ,  ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలని,  లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టం అనే విషయాన్ని జగన్ చెబుతున్నారు.ఇప్పటికే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేల లిస్ట్ ను సైతం జగన్ వైసిపి ఎమ్మెల్యేల సమావేశంలోనే ప్రకటించారు.

వారికి మరో ఛాన్స్ ఇస్తున్నానని,  ఈ సర్వే నివేదికలలో మంచి మార్కులు రాకపోతే వారికి ఇక టికెట్ ఇవ్వడం కష్టమనే విషయాన్ని మొహమాటం లేకుండా జగన్ చెప్పేశారు.
  ఇంత వరకు బాగానే ఉన్నా , వైసిపి ఎమ్మెల్యేల ఆవేదన మాత్రం మరోలా ఉంది.

నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయని, కనీసం నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని మెరుగుపరచుకోలేకపోతున్నామని,  కనీసం రెండు  ట్రాక్టర్ల  గ్రావెల్ కూడా వేయించుకోలేకపోతున్నామని, దీనికి కూడా మంత్రి పర్మిషన్ కావాలని అధికారులు చెబుతున్నారని,  సమస్యలు ఈ విధంగా ఉంటే ప్రజల్లోకి వెళ్తున్న తమను ఆ సమస్యలపైనే వారు నిలదీస్తున్నా,  సరైన సమాధానం చెప్పలేకపోతున్నామని,  ఇలా అయితే తమకు ఏ విధంగా మంచి మార్కులు పడుతాయనే విషయాన్ని నేరుగానే జగన్ వద్ద కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారట.
 

Telugu Ap Cm Jagan, Ap, Ap Roads, Ysrcp, Ysrcp Mlas-Political

అయితే మొన్నటివరకు జగన్ చెప్పింది విని సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు , ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమ వాయిస్ ను పెంచడం, తమకు సరైన మార్కులు పడకపోవడానికి కారణం తమకు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం,  ముఖ్యంగా ఏపీవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అద్వాగా ఉన్నా జగన్ పట్టించుకోకపోవడం లేదని, ఈ కారణంగానే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న , వైసిపి పై జనాల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం ఇదే అనే విషయాన్ని జగన్ దృష్టికి నేరుగా ఎమ్మెల్యేలు ఇప్పుడు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube