మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా మనోజ్ ఆ వార్తల గురించి నోరు మెదపలేదనే సంగతి తెలిసిందే.తన కొత్త సినిమాల గురించి కూడా మనోజ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
తాజాగా మంచు మనోజ్ కడప పెద్ద దర్గాని దర్శించుకుని చాలా నెలల నుంచి ఈ దర్గాను దర్శించుకోవాలని అనుకుంటున్నానని అన్నారు.
త్వరలో కొత్త సినిమాలను ప్రారంభిస్తున్నానని అదే సమయంలో కొత్త లైఫ్ కూడా ప్రారంభిస్తున్నానని మనోజ్ కామెంట్లు చేశారు.
అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.మనోజ్ మౌనికల పెళ్లి 2023 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే మనోజ్ మ్యారేజ్ గురించి స్వయంగా స్పందిస్తే మాత్రమే ఈ విషయాలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
మనోజ్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది.
మనోజ్ ఫ్యాన్స్ మాత్రం మనోజ్ కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం విషయంలో సంతోషంగా జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు.మనోజ్ కొత్త ప్రాజెక్ట్ ఎవరి డైరెక్షన్ లో ఉండబోతుందో తెలియాల్సి ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మనోజ్ ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకోవాల్సి ఉందని మరి కొందరు చెబుతున్నారు.

మనోజ్ మౌనికల పెళ్లి మంచు ఫ్యామిలీకి ఇష్టమేనా? కాదా? అనే ప్రశ్నలకు సంబంధించి కూడా జవాబు దొరకాల్సి ఉంది.మంచు హీరోలలో మనోజ్ పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది.మనోజ్ నటించిన సినిమాలలో పలు సినిమలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అందించాయి.







