మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని జవహర్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోస్టుమార్టం పూర్తి కావడంతో చిన్నారి ఇందు మృతదేహన్ని పోలీసులు జవహర్‌నగర్ కు తరలించారు.
అయితే పోస్టుమార్టం నివేదికను ఇవ్వకుండా మృతదేహాన్ని పోలీసులు అప్పగిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిన్నారి మరణానికి కారణాలు ఏంటో తేల్చాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.పాపను గంజాయి బ్యాచ్ చంపి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో దమ్మాయిగూడలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అయితే చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు.
ఇందు ఊపిరితిత్తులో నీరును గుర్తించిన వైద్యులు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు.చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారించారు.







