ఏపీని అభివృద్ధిలో ముందుంచాలని బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.కేంద్రం ఇస్తున్న వనరులపై సర్కార్ సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు.
2024 నాటికైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న నమ్మకం లేదని విమర్శించారు.కేంద్ర నిధులతో నిర్మించే ఇళ్లకు జగనన్న కాలనీలను పేరు పెట్టడం దారుణమని వ్యాఖ్యనించారు.భవిష్యత్ లో మద్యంపై వచ్చే ఆదాయానికి లోన్ తీసుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు పెట్టడం లేదని ఆరోపించారు.







