మనచుట్టూ అనేకమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.మనదగ్గర ఎక్కువగా వివిధరకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకుంటారు గాని, విదేశాలలో అయితే పిల్లులు కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.
బేసిగ్గా మనుషులకు ఈ పెంపుడు జంతువులు అనేవి కాపలాగా సంరక్షిస్తూ ఉంటాయి.కానీ అదే జంతువుల వలన తమ యజమానులు ప్రాణాలు కోల్పోతే ఎంత దురదృష్టకరం చెప్పండి? తాజాగా అలాంటి ఘటనే జరిగింది.అవును, డెన్మార్క్‌కు చెందిన 33 ఏళ్ల వయసు గల హెన్రిచ్ క్రీగ్‌బామ్ ప్లాట్‌నర్ అనే వ్యక్తి 2018లో ఒక పిల్లి, దాని పిల్లలను పెంచుకునేందుకు ఎంతో ఇష్టంగా తన ఇంటికి తెచ్చుకున్నాడు.ఆ పిల్లిపిల్లల సంరక్షణ సమయంలో పిల్లిపిల్ల హెన్రిక్ వేలు కొరకడం జరిగింది.
ఐతే హెన్రిచ్ ఆ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.దాంతో ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అతని వేలు బాగా వాచిపోయింది.
దీంతో హెన్రిచ్ డెన్మార్క్‌లోని కోడింగ్ ఆసుపత్రికి చెందిన వైద్యులను సంప్రదించాడు.వైద్యుల సిఫార్సు మేరకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.
అలా ఆ పిల్లి తనని కొరకడం వలన హెన్రిచ్‌కు మాంసం కొరుక్కుతినే బ్యాక్టీరియా సోకింది.ఆ ఆసుపత్రిలోనే ఓ నెల రోజులపాటు వైద్యులు అతగాడికి ట్రీట్‌మెంట్ అందించారు.
ఈ క్రమంలో అతన్ని కాపాడేందుకు డాక్టర్లు దాదాపు 15 సార్లు ఆపరేషన్లు చేశారు.అలా 4 నెలలు గడిచినా హెన్రిచ్ వేలు సాధారణ స్థితికి రాకపోవడం బాధాకరం.

దీంతో డాక్టర్లు ఆ భాగాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది.ఆ తర్వాత హెన్రిచ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.మృత్యువుతో పోరాడి ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే హెన్రిచ్ మృత్యువాత పడ్డాడు.ఇక ఈ సంఘటనపై హెన్రిచ్ తల్లి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.హెన్రిచ్‌కు ఇదివరకే న్యుమోనియా, గౌట్, డయాబెటిస్ వ్యాధులు వున్నాయని, దాంతో ఆ పిల్లి కాటువేయడం వలన అతని రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపించిందని వాపోయింది.ఇక మృతుడి భార్య మాట్లాడుతూ.
చివరి శ్వాసవరకు నా భర్త ఎంతో వేధన అనుభవించాడని, తన భర్తలా మరెవరూ చనిపోకూడదని పిల్లులపై అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకొచ్చింది.







