నిజంగా ఆ సినిమా రూ.300 కోట్లు రాబట్టిందా?

బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కాలం లో సౌత్‌ సినిమా ల తో పోల్చితే మినిమం గా కూడా కలెక్షన్స్ ను రాబట్ట లేక పోతున్నాయి.2022 సంవత్సరంలో మొత్తం బాలీవుడ్ లో కలిపి కూడా 3 సినిమా లు కూడా వంద కోట్ల క్లబ్‌ లో చేరలేదు.కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

 Hindi Drishyam 2 Movie Collections , Drishyam 2, Hindi Drishyam 2 Movie, Telugu-TeluguStop.com

ఆ సినిమా తర్వాత యంగ్ హీరో నటించిన భూల్ భులయ్య సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఇప్పుడు అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల కు పైగా వసూలు నమోదు చేసింది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా 300 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కానీ దృశ్య 2 సినిమా 300 కోట్ల రూపాయలు క్రాస్ చేసింది అంటే నమ్మశక్యం గా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ సినిమా ప్రముఖులు కొందరు తమ పరువు ను కాపాడుకోవడం కోసం ఈ సినిమా 300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటో కానీ దృశ్యం 2 సినిమా కి వచ్చిన కలెక్షన్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ప్రస్తుత బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితిని చూస్తే మాత్రం దృశ్యం 2 కు అంత సీన్‌ లేదు అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube