తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు.రేణిగుంట మండలం మల్లవరం సమీపంలోని రాళ్ల కాలువ వద్ద కోడి పందాలను నిర్వహించారు.
పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడానికి వెళ్లగా పోలీసులను చూసిన కొందరు యువకులు పరారైయ్యారు.ఈ నేపథ్యంలోనే భయంతో వాగులోకి దూకిన మనోహార్ అనే యువకుడు గల్లంతైయ్యాడు.
మనోహార్ కోసం వాగులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.







