లుక్ మార్చిన అక్కినేని హీరో.. తెగ వైరల్ చేసేస్తున్న ఫ్యాన్స్!

అక్కినేని హీరోల్లో సుశాంత్ ఒకరు.ఈయన అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.సుశాంత్ కెరీర్ స్టార్టింగ్ నుండే కమర్షియల్ బ్రేక్ రాలేదు.ఈయన కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు దశాబ్దం అయినా ఈయనకు హీరోగా బ్రేక్ రాకపోవడంతో ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించాడు.

 Sushanth Stylish Pic Viral On Social Media, Sushanth, Sushanth Stylish Pic, Soci-TeluguStop.com

ప్రెజెంట్ ఈయన సోలో హీరోగా నటిస్తూనే మరో హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

సెకండ్ హీరోగా అయినా క్యారెక్టర్ ఆరిస్టుగా అయినా ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్తున్న సుశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకు పోతున్నాడు.

ఇప్పుడిప్పుడే మంచి క్యారెక్టర్స్ రావడంతో అన్నిటికి ఒక చెబుతున్నాడు.ఇదిలా ఉండగా సుశాంత్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు.

ఈయన లుక్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.సుశాంత్ న్యూ లుక్ ను చూసి అక్కినేని ఫ్యాన్స్ ఒక పక్క సంతోషంగా ఉన్న మరోపక్క బాధ పడుతున్నారు.

హీరోగా అన్ని క్వాలిటీలు ఉన్న తమ హీరోకు సక్సెస్ దక్కడం లేదు అని బాధను వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.ఇక ప్రెజెంట్ సుశాంత్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు.

మాస్ రాజా రవితేజ ”రావణాసుర” సినిమాలో కూడా సుశాంత్ కీలక రోల్ లో నటిస్తున్నాడు.మరి ఈ సినిమాతో అయినా సుశాంత్ సత్తా చాటుతాడా లేదా వేచి ఉండాల్సిందే.రావణాసుర సూపర్ హిట్ అయితే సుశాంత్ మరింత బిజీ అవ్వడమే కాదు వరుస అవకాశాలు అందుకుని దూసుకు పోవడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube