అమెరికా : ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై నుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 Us: Indian-origin Teenager Jumps Off Golden Gate Bridge In San Francisco, San F-TeluguStop.com

కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్కో‌లో వున్న ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెన పైనుంచి దూకి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

వంతెనపై నుంచి ఎవరో దూకినట్లు ధ్రువీకరించుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లు యూఎస్ కోస్టల్ గార్డ్స్ తెలిపింది.అయితే బాలుడు ప్రాణాలతో వుండే అవకాశం తక్కువేని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ఇండియన్ కమ్యూనిటీ నేత జైన్ భూటోరియా మాట్లాడుతూ.గోల్డెన్ గేట్ బ్రిడ్జి వద్ద ఇటీవలికాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.భారత సంతతికి చెందిన వ్యక్తులకు కూడా ఇది సూసైడ్ స్పాట్‌గా మారిందని భూటోరియా ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు 1937లో ఈ వంతెన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2 వేలమందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ చెబుతోంది.

ఈ సంస్థ ఇక్కడ ఆత్మహత్యలను నివారించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.గతేడాది ఇక్కడ 25 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ఈ సంస్థ చెబుతోంది.

అటు కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌కు ఇరువైపులా దాదాపు 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచె నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.2018లో ఈ కంచె నిర్మాణం ప్రారంభం కాగా.ఈ ఏడాది జనవరికల్లా పూర్తి కావాల్సి వుంది.

అయితే ఖర్చు పెరగడంతో జాప్యం జరుగుతోంది.ఈలోపు విలువైన ప్రాణాలు పోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube