సాధారణంగా హీరోలు ఎవరైనా సినిమాసినిమాకు రెమ్యూనరేషన్ పెరిగితే బాగుంటుందని భావిస్తారు.అయితే కొంతమంది హీరోలు వరుస ఫ్లాపుల వల్ల రెమ్యునరేషన్ కంటే సక్సెస్ సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.2023లో అయినా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కెరీర్ విషయంలో మరింత ఎదగాలని ఈ ఏడాది ఫ్లాపుల వల్ల కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న హీరోలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
సక్సెస్ లో ఉన్న హీరోలు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను పెంచాలని భావిస్తుండగా యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలయ్యాయో కూడా తెలియడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో సక్సెస్ లను ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో కలెక్షన్ల విషయంలో నిరాశపరుస్తున్నాయి.
మంచి బ్యానర్, కథ, దర్శకుడు సెట్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ఈ యంగ్ హీరో సిద్ధంగా ఉన్నారు.మరో హీరో శ్రీ విష్ణు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
ఈ ఏడాది శ్రీ విష్ణు నటించి విడుదలైన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.మంచి బ్యానర్ లో ఛాన్స్ దక్కితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఈ హీరో కూడా సిద్ధమేనని సమాచారం అందుతోంది.

నాగశౌర్య కూడా ఈ హీరోల రూట్ ను ఫాలో అవుతున్నారు.ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి మూవీ ఫలితం నాగశౌర్యకు భారీ షాకిచ్చింది.ఆది సాయికుమార్, కిరణ్ అబ్బవరం సినిమాలు కూడా వరుసగా థియేటర్లలో విడుదలవుతున్నా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలవుతున్నాయి.ఈ హీరోలు కూడా రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటారని తెలుస్తోంది.
సక్సెస్ లో ఉన్న హీరోలు మాత్రం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది.







