తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ అందరికీ సుపరిచితమే.ఈమె యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించారు.
ఇక సుమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షూటింగ్ లొకేషన్లో తన టీం తో కలిసి చేసే హంగామా గురించి కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె తన స్టాప్ అందరిని ఒక్క తోపు తోసేసింది.
తనని ఒంటరిగా వదిలేయండి అని చెప్పినప్పటికీ వాళ్లు మాత్రం తనని వదలకుండా తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియో సందర్భంగా ఎంతో డెడికేషన్ ఉన్నటువంటి టీం ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈమె తెలిపారు.

ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న లీవ్ మీ ఎలోన్ అంటూ సాగుతున్న ట్రెండింగ్ వీడియోకు సుమ తాజాగా రీల్స్ చేసింది.ఇందులో తన టీం మెంబర్లంతా తనని వదలకుండా పనిచేస్తూ ఉన్నారు.నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఈమె తన స్టాఫ్ మొత్తాన్ని తోసేసింది.
ఈ వీడియో చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ కొందరు మాత్రం సుమక్క ఎందుకంత కోపం అంటూ కామెంట్లు చేయగా.మరికొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది.
జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేసిన సుమ ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ ఉన్న సినిమా కథలను వింటున్నారని సమాచారం.







