హాలీవుడ్ మూవీ అవతార్ 2 విడుదలకు సిద్ధం అయింది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా ను వెండి తెర పై చూస్తామా అంటూ కొన్ని నెలలుగా అవతార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ ఒక అద్భుతమైన ప్రపంచం లోకి ప్రేక్షకులను తీసుకు వెళ్ళింది.ఆ భాష.ఈ భాష.ఆ దేశం.ఈ దేశం.అని కాకుండా విడుదలైన ప్రతి చోట కూడా అవతార్ ప్రభంజనం సృష్టించి అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇండియా లో అవతార్ సాధించబోతున్న కలెక్షన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.కచ్చితం గా రూ.500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అవతార్ సాధించబోతుందని అనే నమ్మకాన్ని బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున అవతార్ 2 సినిమా ను విడుదల చేసేందుకు గాను ఏర్పాటు చేశారు.ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా అత్యధిక కలెక్షన్స్ నమోదు చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.ఇండియా లో డిస్నీ వారు మంచి మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు.
కనుక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేయడం తో ఈ సంవత్సరం లో వచ్చిన సినిమాల కలెక్షన్స్ మరియు వాటి యొక్క రికార్డులు ఇలా అన్ని విషయాల్లో కూడా లెక్కలు తారు మారు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.అవతార్ 2 గతం లో ఎప్పుడు లేనంత భారీ కలెక్షన్స్ ని నమోదు చేసి డబ్బింగ్ సినిమాల చరిత్ర తిరగ రాయడం ఖాయం అంటూ అవతార్ యొక్క అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ తోనే పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయ్యాయి అనేది టాక్.