బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తూ టైటిల్ రేస్ లో ఉన్నటువంటి ఇనయ ఉన్నఫలంగా 14 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ప్రతి ఒక్క టాస్కులను అందరికీ గట్టి పోటీ ఇస్తూ నిలబడిన ఈమె ఎలిమినేట్ కావడంతో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇక ఈమె ఎలిమినేషన్ కరెక్ట్ కాదని కొందరి కోసం బిగ్ బాస్ తనని ఎలిమినేట్ చేశారంటూ మండిపడుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ కేఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ క్రమంలోనే యాంకర్ శివ ఇనయాను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆమెకు పిచ్చెక్కించాడు.ఇక ఇనయ కూడా ఏ మాత్రం తగ్గేదిలే అన్నట్టుగా మాటకు మాట కౌంటర్ ఇస్తూ శివ నోరు మూయించింది.
ఇక శివ తనని ప్రశ్నిస్తూ హౌస్ లో రేవంత్ వ్యక్తిత్వం ఎలాంటిది అని ప్రశ్నించగా తాను పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాడని సమాధానం చెప్పింది.అంటే నీలాగేనా అంటూ శివ అనడంతో రేవంత్ గురించి అడిగి మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు అంటూ ఈమె మండిపడింది.
ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో సూర్యతో ప్రేమలో ఉండటం వల్ల ఆట సరిగా ఆడలేకపోయారని శివ ప్రశ్నించడంతో నేను చెప్పానా నీకు సూర్యతో లవ్ లో ఉన్నానని అంటూ ఇనయ కౌంటర్ ఇచ్చింది.దీంతో ఏం మాట్లాడాలో తెలియక శివ సైలెంట్ అయ్యారు.అయితే హౌస్ లో ఉన్నప్పుడు సూర్యతో ఎంతో చనువుగా ఉన్నటువంటి ఇనయ, అతను ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఎంతో బాధపడింది.అయితే ఇప్పుడు మాత్రం నేను తనని లవ్ చేయలేదు అంటూ ఈమె చెప్పిన కామెంట్స్ వైరల్ కావడంతో ఏంటి వీళ్ళిద్దరూ లవ్ చేసుకోలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.