చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కనడానికి అసలు కారణాలు ఇవే?

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో కనీవిని ఎరుగని విజయాలను సొంతం చేసుకున్నారు.మగధీర, రంగస్థలం, ఆర్.

 Shocking Facts Behind Charan Upasana Pregnancy Plans Details, Charan , Upasana,-TeluguStop.com

ఆర్.ఆర్ సినిమాల విజయాల వల్ల చరణ్ ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.చరణ్ ఉపాసనలకు పెళ్లి జరిగి పదేళ్లు కాగా ఈ జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే అటు ఉపాసనకు ఇటు రామ్ చరణ్ కు తల్లీదండ్రులు కాబోతున్నారనే శుభవార్త ఎప్పుడు చెబుతారనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఒక దశలో ఈ ప్రశ్నల వల్ల విసిగిపోయిన ఉపాసన ఒకింత ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.అయితే వ్యక్తిగత కారణాల వల్లే చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

అటు చరణ్ ఇటు ఉపాసన ఇన్నేళ్ల పాటు కెరీర్ పరంగా బిజీగానే ఉన్నారు.చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఉపాసన అపోలో ఆస్పత్రికి సంబంధించిన బాధ్యతలతో బిజీ అయ్యారు.

కెరీర్ పరంగా ఉపాసన నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు ఇతర సమస్యలను చరణ్ ఉపాసన సాల్వ్ చేసుకున్నారని ఈ రీజన్ వల్లే చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారని తెలుస్తోంది.ఉపాసన గర్భవతి అని తెలిసిన వెంటనే జూనియర్ ఉపాసన పుడుతుందో లేక జూనియర్ చరణ్ పుడతాడో అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కరోనా వల్ల కూడా చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కనాలని భావించినట్టు సమాచారం అందుతోంది.ఉపాసన గర్భవతి అనే వార్త మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించింది.కొణిదెల కుటుంబంలో మరో తరం దిశగా అడుగులు పడుతున్నాయి.రామ్ చరణ్ ప్రొఫెషనల్ గా బిజీగా ఉండగా వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ప్రమోషన్ అందుకోనున్నారనే వార్త ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube