క్రిస్మస్ పండుగ ముందు బ్రిటన్ లో పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పింఛన్లు పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో జరుగుతున్న ఈ సమ్మెలో విమానం, అంబులెన్స్, నర్సింగ్, పోస్టల్, టీచింగ్, రైల్వే, బస్సు సిబ్బంది సహ వివిధ విభాగాలకు చెందిన దాదాపు రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని ఉన్నారు.
అందువల్ల అన్ని రకాల సేవలు బ్రిటన్ లో నిలిచిపోయే అవకాశం ఉంది.గత 30 సంవత్సరాల లో ఇదే అతిపెద్ద సమ్మెగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సనాక్ కు ఈ సమ్మె ఒక ఛాలెంజ్గా నిలబడే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి శాఖ ఉద్యోగులు వారికి సంబంధించిన రకరకాల డిమాండ్లను చెబుతున్నారు.
అందరి ఉమ్మడి డిమాండ్ మాత్రం జీతాలు పెంచడమే అని తెలుస్తోంది.తమ జీతాలు వేగంగా పెరగడం లేదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.యూకే లో ద్రవ్యోల్బణం రేటు 11.1% గా ఉంది.అయితే నర్సింగ్ సిబ్బంది జీతం 4.75%, అంబులెన్స్ సిబ్బంది జీవితం నాలుగు శాతం మాత్రమే పెరిగింది.పోస్టల్ ఉద్యోగులకు 9% వేతన పెంపును ప్రతిపాదించగా వారు కూడా అందుకు ఒప్పుకోలేదు.అయితే మొదటిగా ఈనెల 7న ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు.జీతం పెంచడంతోపాటు పింఛన్ పెంచాలని వారి ముఖ్యమైన డిమాండ్.
గాట్విక్, హీత్రో, మాంచెస్టర్, గ్లాస్గో, కార్డిఫ్‌లలో విమానాశ్రయ సిబ్బంది ఈ నెల 23 నుంచి 26 వరకు, తిరిగి ఇదే నెల 28 నుంచి 31 వ తేదీ లలో సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది.ఈ సమ్మె ప్రభావాన్ని నివారించేందుకు ఎయిర్ పోర్ట్ లో వద్దా, ఓడరేవుల వద్ద సైన్యాన్ని భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే దాదాపు 40 వేల మంది రైల్వే కార్మికులు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు సమ్మె చేసే అవకాశం ఉంది.
ఈనెల 15 నుంచి 20 తేదీలలో దాదాపు లక్ష మంది నర్సులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా ఈనెల 21, 28 తేదీలలో పదివేల మంది అంబులెన్స్ కార్మికులు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది.