తాజాగా టోక్యోకు చెందిన ఒక కంపెనీ చంద్రుడిపైకి మిషన్‌ను పంపిన మొదటి ప్రైవేట్ సంస్థగా అవతరించింది.నిజానికి జపాన్ టెక్నాలజీలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.
ఇప్పుడు కూడా అదే లక్షణాన్ని ప్రదర్శిస్తూ జపాన్ తాజాగా అంతరిక్ష ప్రయోగంతో సరికొత్త అధ్యాయం సృష్టించింది.జపాన్ దేశానికి చెందిన ఐస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ చంద్రుడిపైకి కమర్షియల్ వ్యోమనౌక పంపి రికార్డు సృష్టించింది.
హకుటో-ఆర్ మిషన్ అని దీనిని జపాన్ కంపెనీ పిలుస్తోంది.
హకుటో-ఆర్ అంటే జపనీస్ భాషలో తెల్ల కుందేలు అని అర్థం.
ఈ స్పేస్ షిప్ ఐస్పేస్ కంపెనీ నుంచి ఏప్రిల్ 2023లో చంద్రునిపై దిగుతుందని భావిస్తున్నారు.ల్యాండర్, దాని ప్రయోగాలు చంద్రుడిని చేరుకోవడానికి దాదాపు ఐదు నెలల సమయం పడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
డబ్బును ఆదా చేయడానికి, కార్గో కోసం ఎక్కువ స్పేస్ మిగల్చడానికి, తక్కువ ఇంధనాన్ని ఉపయోగించేలా సంస్థ ispace తన క్రాఫ్ట్‌ను రూపొందించింది.
కనుక ఇది చంద్రునికి నెమ్మదిగా, తక్కువ-శక్తి మార్గాన్ని తీసుకుంటోంది.ఏప్రిల్ చివరి నాటికి తిరిగి చంద్రునితో కలుస్తుంది.మొత్తంగా ఈ వ్యోమ నౌక భూమి నుంచి 1 మిలియన్ మైళ్ళు (1.6 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణిస్తుంది.ఈ హాకుమో-ఆర్‌ఎం1 అనే వ్యోమనౌకను పంపడానికి గానూ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయం తీసుకుంది.
ఏదేమైనా జపాన్‌కి ఎక్కువ సక్సెస్ కావడమే తెలుసు కాబట్టి ఈ మిషన్‌లో కచ్చితంగా అది సక్సెస్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.