చిరంజీవి, బాలయ్యలకు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడ్డాయి.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కొన్ని వారాల గ్యాప్ తో థియేటర్లలో విడుదలవుతాయని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ఆలస్యంగా ప్రకటించడంతో ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని 200 సెంటర్లలో సంక్రాంతి కానుకగా చిరంజీవి, బాలయ్య సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.200 సెంటర్లలో ఈ సినిమాలకు బదులుగా వారసుడు మూవీ మాత్రమే రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ నంబర్ భారీ నంబర్ కావడంతో చిరంజీవి, బాలయ్య అభిమానులకు టెన్షన్ మొదలైంది.ఈ 200 సెంటర్ల వల్ల చిరంజీవి, బాలయ్య సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడం సాధ్యం కాదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
భారీ సంఖ్యలో థియేటర్లలో సినిమా రిలీజ్ కాకపోవడం అంటే ఫ్యాన్స్ కు ఒక విధంగా షాకేనని చెప్పవచ్చు.అయితే అదనపు షోలకు అనుమతి లభిస్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి, బాలయ్య ప్రస్తుతం థియేటర్ల సమస్య విషయంలో సైలెంట్ అయినా సమయం వస్తే వీళ్లు నోరు విప్పి ఈ సమస్య గురించి సీరియస్ గా స్పందించే ఛాన్స్ అయితే ఉంది.
చిరంజీవి, బాలయ్యల మౌనాన్ని తక్కువగా అంచనా వేయవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తెలుగు సినిమాలకే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సంక్రాంతి సినిమాల విడుదలకు 30 రోజుల సమయం ఉండగా సినిమా రిలీజ్ సమయానికి పరిస్థితులు మారతాయేమో చూడాల్సి ఉంది.
ఈ ఇద్దరు హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.