డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే మన తెలుగు ఆడియెన్స్ కు అభిమానం ఎక్కువ.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా సూపర్ హిట్ సినిమాలను అందించాడు.
మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో.టేకింగ్ తో మెప్పిస్తాడు.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.ఎవ్వరూ ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది.
దీంతో పూరీ జగన్నాథ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా అలా ప్లాప్ అవ్వడంతో కోలుకోలేక పోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత జగనగనమణ చేయాల్సి ఉండగా ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఈ భారీ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.
ఇక ఈ సినిమా తర్వాత ఈయన పలు హీరోలతో సినిమాలు చేయబోతున్నాడు అనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ వంటి వారి పేర్లు వినిపించాయి.ఇక ఇప్పుడు ఈ లిష్టులో మరొకరి పేరు వినిపిస్తుంది.ఆయన మరెవరో కాదు.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఈయన సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా సల్మాన్ పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇప్పుడు క్రేజీ రూమర్ వినిపిస్తుంది.మరి ఈ రూమర్ అయిన నిజం అవుతుందో లేదో చూడాలి.మొన్నటి వరకు మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడు అని టాక్ వచ్చింది.ఆ తర్వాత రవితేజతో చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.మరి మళ్ళీ ఏకంగా బాలీవుడ్ స్టార్ తో సినిమా అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఈ వార్తలపై పూరీ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.