టాలీవుడ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట చిన్న చిన్న పాత్రలతో నటిస్తూ కెరియర్ ను మొదలుపెట్టిన సత్యదేవ్ ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
హీరోగానే కాకుండా విలన్ గా సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే సత్యదేవ్ తాజాగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు సత్యదేవ్.
ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ.
నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనతో కలిసి నటించడంతో నా జన్మ ధన్యమైంది అని తెలిపారు సత్యదేవ్.అలాగే నుదుటిపై దెబ్బ తగలడానికి కూడా చిరంజీవినే కారణమని, చిరంజీవి ప్రాక్టీస్ చేస్తూ కిందపడి దెబ్బ తగిలింది అని చెప్పుకొచ్చారు సత్యదేవ్.
ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు సత్యదేవ్.మేము షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాము.అక్కడ షూటింగ్ చేసుకొని తిరిగి వస్తుండగా ఎయిర్ పోర్టులో నన్ను సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్టు చేశారు అని తెలిపాడు సత్యదేవ్.మామూలుగా సూసైడ్ బాంబర్స్ కాలు కింద ట్రిగ్గర్ పెట్టుకుని ఉంటారు.

అలా నా పక్కన కూర్చుని ఒక వ్యక్తి తన కాలు కింద ఏవో పెట్టుకుని దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉండగా అది చూసిన పోలీసులు వెంటనే అనుమానం వచ్చి అతడిని అతని పక్కన ఉన్న నన్ను ఇద్దరినీ తీసుకెళ్లి అరెస్టు చేశారు.అనంతరం చిత్ర బృందం వచ్చి వారికి అసలు విషయం చెప్పడంతో వాళ్ళు వదిలేశారు అని చెప్పుకొచ్చాడు హీరో సత్యదేవ్. గుర్తుందా శీతాకాలం ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల తన భార్యను మొదటిసారిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.అతని భార్య అతని ప్రతి ఒక సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది.







