బిగ్ బాస్ సీజన్5 కంటెస్టెంట్లలో సిరి హన్మంత్ ఒకరు కాగా షణ్ముఖ్ బిగ్ బాస్ విజేతగా నిలవకపోవడానికి కారణం సిరి అని చాలామంది భావిస్తారు.సిరి అతి ప్రవర్తన వల్ల షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోయిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో సిరి శ్రీహాన్ కూడా విడిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.కొంతకాలం పాటు సిరి శ్రీహాన్ దూరంగా ఉండటంతో ఆ ప్రచారం నిజమేనని అందరూ నమ్మారు.
తాజాగా ఆ ప్రచారం గురించి సిరి హన్మంత్ స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.బిగ్ బాస్ సీజన్5 పూర్తై బయటకు వచ్చిన తర్వాత తమ పర్సనల్ లైఫ్ లో చాలా సమస్యలు వచ్చాయని సిరి కామెంట్లు చేశారు.
ఆ సమస్యలు చాలా ఎక్కువగా రావడంతో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ సిరి అన్నారు.ఆ సంఘటనల గురించి చెబితే ఈ విధంగా జరిగిందా? అని ఆశ్చర్యపోతారని సిరి హన్మంత్ కామెంట్లు చేశారు.

నాకు శ్రీహాన్ కు మధ్య ఉన్న బంధం దాదాపుగా విడిపోయే వరకు వచ్చిందని ఆమె తెలిపారు.శ్రీహాన్ ఒంటరిగా ట్రిప్ కు వెళ్లగా ఆ సమయంలో నేను ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నానని ఆమె అన్నారు.మణికొండ రోడ్లపై తాను చెప్పులు లేకుండా తిరిగానని సిరి హన్మంత్ వెల్లడించారు.ప్రస్తుతం తనకు శ్రీహాన్ కు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉందని సిరి హన్మంత్ కామెంట్లు చేశారు.

ఇకపై ఎప్పటికీ విడిపోమనే స్థాయిలో మా ఇద్దరి మధ్య బంధం బలపడిందని ఆమె వెల్లడించారు.షణ్ముఖ్ దీప్తి సునైనా కూడా కలిస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.ప్రస్తుతం షణ్ముఖ్ కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నారు.షణ్ముఖ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.







