తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీకి పయనం కానున్నారు.ఈనెల 14వ తేదీన హస్తినలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారని సమాచారం.బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ కార్యదర్శులను కేసీఆర్ ప్రకటించనున్నారు.
అనంతరం ఢిల్లీలో పలు రాజకీయ, సామాజిక కార్యకర్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.







