America citizenship : అమెరికా : USCIS కీలక ప్రకటన...10 లక్షల మందికి అమెరికా పౌరసత్వం...!!

అమెరికా వెళ్ళాలి ,మంచి ఉద్యోగం సంపాదించాలి, అక్కడే స్థిరపడాలని కలలు కనే వారు చాలా మంది ఉంటారు.గతంలో అంటే వలసలు అప్పుడప్పుడే మొదలైన సమయంలో శాశ్వత నివాసం పొందేందుకు పెద్దగా సమయం పట్టేది కాదు పైగా పోటీ కూడా ఉండేది కాదు.

 అమెరికా : Uscis కీలక ప్రకటన…10 లక్-TeluguStop.com

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో శాశ్వత నివాసం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంది… తాజాగా అమెరికా ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా పౌరసత్వం పొందిన వారి సంఖ్య దాదాపు 10 లక్షల పైనే ఉందట.

అంటే ప్రపంచ దేశాల నుంచి అమెరికా వలస వచ్చిన వారి లో దాదాపు 10 లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు.ఇది కేవలం పెద్దవారికి జారీ చేసిన శాశ్వత హోదా సంక్షే మాత్రమే అదే చిన్నపిల్లలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య సుమారు పది లక్షల 50 వేలకు చేరుకుంటుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వెల్లడించింది… అయితే.

Telugu America, Joe Biden, Mexico, Citizenship, Uscis-Telugu NRI

అమెరికా శాశ్వత పౌరసత్వం కలిగిన ఈ పది లక్షల మందిలో ఎంతమంది ఏ దేశానికి సంబంధించిన వారు అనేది ఇమిగ్రేషన్ సర్వీస్ వెల్లడించలేదు.కాగా మెక్సికోకు చెందిన పౌరులు అత్యధికంగా శాశ్వత పౌరసత్వం కలిగిన వారిలో ఉన్నారని తెలుస్తోంది ఆ తరువాత స్థానంలో భారతి నుంచి వచ్చిన పౌరులు ఉన్నారని నిపుణులు అంటున్నారు.ఇదిలాఉంటే గడిచిన 15 ఏళ్లలో విదేశీయులకు ఈ స్థాయిలో శాశ్వత పౌరసత్వం ఇవ్వలేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube