Rajeev Kanakala Devdas Kanakala : ఎంతో టాలెంట్ ఉన్న రాజీవ్ కనకాల తండ్రిని ఇండస్ట్రీలో తొక్కేశారా?

రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాక్టర్ గా, డైరెక్టర్ గా, నట శిక్షకుడిగా దేవదాస్ కనకాల గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Shocking Facts About Rajiv Kanakala Father Details Here Goes Viral  , Rajeev Kan-TeluguStop.com

యానాం శివారులోని కనకాలపేటలో దేవదాస్ కనకాల జన్మించారు.దేవదాస్ కనకాల ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా పని చేశారు.

దేవదాస్ కనకాల, లక్ష్మీదేవిలకు 1971 సంవత్సరంలో మ్యారేజ్ జరగగా ఈ వివాహం ప్రేమ వివాహం కావడం గమనార్హం.ఆ తర్వాత రోజుల్లో దేవదాస్ కనకాల నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

చలిచీమలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు ఆయన డైరెక్టర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అమృతం సీరియల్ ఆయనకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. భరత్ అనే నేను మూవీ ఆయన నటించిన చివరి మూవీ కావడం గమనార్హం.

అయితే దేవదాస్ కనకాలకు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని చాలామంది భావిస్తారు.

ఎంతో టాలెంట్ ఉన్న రాజీవ్ కనకాల తండ్రిని ఇండస్ట్రీలో తొక్కేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఓ సీత కథ సినిమాలో దేవదాస్ కనకాల అద్భుతంగా చేశారని ఆయనను ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో తొక్కేశారని ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు.

Telugu Andhra, Devdas Kanakala, Rajeev Kanakala-Movie

లక్ ఫ్యాక్టర్ కూడా దేవదాస్ కనకాలకు కలిసిరాలేదని అందుకే ఆయన ఇండస్ట్రీలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదని చాలామంది భావిస్తున్నారు.దేవదాస్ కనకాల వారసుడు రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.రాజీవ్ కనకాల ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రాజీవ్ కనకాలకు భారీగానే రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube