ఎట్టకేలకు గోపీచంద్ మలినేని అనుకున్న విధంగా షూట్ పూర్తి చేసాడు.దీంతో ఇప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం పోయింది.
ముందు నుండి గోపీచంద్ పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగాడు.మరి అసలు మ్యాటర్ ఏంటంటే.
నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.
ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.అందుకే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా సంక్రాంతి 2023లో రిలీజ్ కాబోతుంది అని గత నెలలోనే ప్రకటించారు.అయితే మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోక పోవడంతో అంతా కంగారు పడ్డారు.అయితే ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి అయినట్టు లేటెస్ట్ గా ఒక వార్త బయటకు వచ్చింది.
ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.మరొక పక్క సాంగ్ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొత్తానికి నెల ముందే షూట్ అయితే పూర్తి చేయడంతో టీమ్ రిలాక్స్ గా ఫీల్ అవుతుంది.ఈ సినిమాను జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టుగా బాలయ్య మాసివ్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.
చూడాలి బాలయ్య అఖండ సక్సెస్ ను కొనసాగిస్తాడో లేదో.