కెనడా భారత్ మధ్య విమాన సర్వీసులకు సంబంధించి కొత్త ఒప్పందంలో పంజాబ్‌ను, ప్రధానంగా అమృత్‌సర్‌లోని శ్రీగురురామ్ దాస్‌జీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విస్మరించడంపై శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఎస్‌జీపీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.
ఇది పవిత్ర నగరం పట్ల వివక్షపూరిత వైఖరి అని, దీని కారణంగా భారతదేశంతో పాటు విదేశాల్లో వున్న సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
కొత్త ఒప్పందం ప్రకారం.
భారతదేశంలోని పలు నగరాలు, విమానాశ్రయాలు చేర్చబడ్డాయి.అయితే పంజాబీలు, ముఖ్యంగా సిక్కులు అమృత్‌సర్‌ను విసర్మించడం ద్వారా వివక్షకు గురయ్యారని గ్రేవాల్ దుయ్యబట్టారు.
మార్చి 30, 2022న ఎస్‌జీపీసీ ప్రెసిడెంట్ హర్జిందర్ సింగ్ ధామి నేతృత్వంలో జరిగిన ఎస్‌జీపీసీ బడ్జెట్ సెషన్‌లో… అమృత్‌సర్ నుంచి నేరుగా పలు ప్రాంతాలకు విమానాలు నడపాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి భారత ప్రభుత్వానికి పంపినట్లు గ్రేవాల్ తెలిపారు.

ఇప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌కు విమానాలను కేటాయించలేదని, ఇది మొత్తం పంజాబీలకు జరిగిన అన్యాయమని ఆయన దుయ్యబట్టారు.ఢిల్లీ నుంచి పంజాబ్‌కు చేరుకోవాలంటే తమ విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా, ఆర్ధికంగానూ నష్టం కలుగుతుందని గ్రేవాల్ పేర్కొన్నారు.కెనడా నుంచి భారత్‌కు వచ్చే విమానాలకు సంబంధించి అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌కు వాటాను కేటాయించాలని గ్రేవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే… కెనడా- పంజాబ్ రాష్ట్రాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడపాలంటూ కెనడాలో స్థిరపడిన సిక్కు ఎంపీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.కెనడాలో సిక్కులు, పంజాబీలు, ఇతర భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని వారు ఆ దేశ ప్రభుత్వ విమానయాన సంస్థను కోరారు.
ఈ మేరకు గత నెలలో ఎయిర్ కెనడాకు భారత సంతతి ఎంపీలు టిమ్ ఉప్పల్, జస్‌రాజ్ సింగ్ హలన్, బ్రాడ్లీ విస్, మార్క్ స్ట్రాల్‌లు లేఖ రాశారు.కెనడాలోని పలు నగరాల నుంచి అమృత్‌సర్‌ల మధ్య నేరుగా విమానాలు నడపడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు కూడా ప్రయోజనకరంగా వుంటుందని వారు లేఖలో పేర్కొన్నారు.

అందుబాటులో వున్న డేటాను బట్టి.భారత్ నుంచి టొరంటోకి ఏడాదికి ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తూ వుంటారని అంచనా.వీరిలో ఎక్కువమంది పంజాబీలే.కెనడా- భారత్‌లోని అమృత్‌సర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు.అటు నుంచి ఇటు రావాలన్నా.ఇటు నుంచి అటు వెళ్లాలన్నా మధ్యలో విమానాలు మారాల్సి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
.