పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటున్నారు.
ఇప్పటికే ఈయన ప్రకటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమా పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈయన దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారని వార్తలు కూడా వినపడుతున్నాయి.

ఇకపోతే సుజీత్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు డివివి ఎంటర్టైన్మెంట్స్ భారీగానే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని అంత మొత్తంలో ఇవ్వడానికి దానయ్య కూడా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.ఇప్పటికే అడ్వాన్స్ కింద 25 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కు అందించినట్టు తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది.ఇక ఈ సినిమా కోసం పవన్ 70 కోట్లు తీసుకోబోతున్నారని తెలియడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







