ఏ సినిమాలకు అయినా మండే టెస్ట్ చాలా కీలకం అని చెప్పాలి.ఎందుకంటే కొత్త సినిమాలు ప్రతీ శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి.
శని, ఆదివారాలు వీకెండ్ కాబట్టి ఎలాగైనా కెలెక్షన్స్ సాధిస్తాయి.కానీ ఆ తర్వాత సోమవారం రోజు అందరికి వీక్ స్టార్ట్ డే కాబట్టి కలెక్షన్స్ సాధించడం కష్టమే.
అందుకే ఏ సినిమాకు అయిన సోమవారం టెస్ట్ చాలా కీలకం.
ఆ రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా వస్తేనే సినిమా మిగతా రోజుల్లో కూడా ఆడుతుంది అనే నమ్మకం వస్తుంది.
ఇక ఇప్పుడు మొన్న శుక్రవారం వచ్చిన హిట్ 2 సినిమా సోమవారం టెస్ట్ ఎదుర్కోబోతుంది.ఈ టెస్ట్ పాస్ అయితే మరిన్ని కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2‘.హిట్ 1 సినిమా గత ఏడాది విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ హిట్ ఫ్రాంచైజీ తెరకెక్కించారు.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొన్న శుక్రవారం డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11.27 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.యూఎస్ లో 500 కె డాలర్స్ రాబట్టింది.ఆదివారం కూడా ఇదే స్థాయి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 70 శాతం బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం టెస్ట్ ని హిట్ 2 చాలా సులువుగానే క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది.ముందు నుండి ఈ సినిమా ప్రొమోషన్స్ బాగా చేయడం వల్లనే మంచి హిట్ సొంతం చేసుకుని వసూళ్లు రాబడుతుంది.







