ఇండిగో విమానయాన సంస్థపై హీరో దగ్గుబాటి రానా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై మండిపడుతూ ట్వీట్ చేశారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందన్నారు.విమాన సమయాలు సరిగా లేవని, మిస్సైన లగేజీ ట్రాకింగ్ కూడా సరిగా లేదని పేర్కొన్నారు.
సిబ్బందికి సరైన సమాచారం ఉండదని విమర్శించారు.హైదరాబాద్ నుంచి రానా తన కుటుంబ సభ్యులతో బెంగళూరుకు వెళ్లారు.
శంషాబాద్ విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ రానాకు సిబ్బంది సమాచారం ఇచ్చారు.దీంతో ఆయన మరో విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు.
అయితే లగేజ్ ఇంకో విమానంలో వస్తుందని సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో లగేజీ రాకపోవడంతో రానా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.







