Tollywood Heroines Diseases: సమంత తరహా వ్యాధితో బాధ పడుతున్న టాలీవుడ్ హీరోయిన్స్

ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా హీరోయిన్స్ జబ్బుల పాలవుతున్న విషయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.ఒక్కొక్కరు ఒక్కో ప్రాణాంతకమైన జబ్బులతో ఫైట్ చేస్తున్నారు.

 Tollywood Heroines Kalpika Ganesh Poonam Kaur Who Are Facing Same Problem Like S-TeluguStop.com

ఈ విషయాన్నీ వారు సైతం దాచడానికి ఇష్టపడటం లేదు.ఈ గ్లామరస్ ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ఫిజిక్ కాపాడుకోవాలి, ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలి.

అలాగే అందంగా కూడా కనిపించాలి.ఇవన్నీ ఉండాలంటే ఎంతో కఠినమైన డైట్ చేయాల్సి ఉంటుంది.

కడుపు మాడ్చుకొని అందంగా కనిపించేందుకు వాటర్ డైట్, ప్లాంట్ బేస్డ్ డైట్ అని రకరకాల కొత్త పద్ధతులు ప్రయత్నిస్తున్నారు.అందుకే హీరోయిన్స్ మాత్రమే ఇలా రకరకాల కొత్త జబ్బులకు గురవుతున్నారు.మరి ఆలా ఈ మధ్య కాలంలో జబ్బుల పాలవుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

సమంత

Telugu Diseases, Kalpika Ganesh, Myositis, Poonam Kaur, Samantha, Tollywood, Yas

హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధికి గురయిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆమె ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది.ఆమె తనకు వచ్చిన జబ్బుని బయట పెట్టిన తర్వాత అందరు షాక్ కి గురయ్యారు.

ఆమె ఆ వ్యాధితో పోరాడతానని చూసి అందరు నోరెళ్లపెట్టాడుతున్నారు.మయోసిటిస్ వ్యాధి బారిన పడిన వారు చాల నరకయాతన అనుభవిస్తారు.ఆ బాధ అనుభవిస్తూనే యశోద సినిమా చేయగా అది మంచి పాజిటివ్ టాక్ తో నడిచింది.

కల్పిక గణేష్

Telugu Diseases, Kalpika Ganesh, Myositis, Poonam Kaur, Samantha, Tollywood, Yas

చాల ఏళ్లుగా సినిమాల్లో ఉన్నప్పటికి సరైన గుర్తింపు రాని కల్పిక గణేశన్ యశోద సినిమాతో మంచి పాపులారిటి దక్కించుకుంది.ఈ సినిమా విజయం సాధించిన తర్వాత కల్పిక పలు ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ ఆమెకు సైతం సమంతకు వచ్చిన వ్యాధి వచ్చిందంటూ బయట పెట్టి షాకిచ్చింది.

పూనమ్ కౌర్

Telugu Diseases, Kalpika Ganesh, Myositis, Poonam Kaur, Samantha, Tollywood, Yas

పూనమ్ కౌర్ సైతం ఆయుర్వేద వైద్యం చేయించుకుంటూ ఇటీవల సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది.ఆమెకు సైతం పై హీరోయిన్స్ కి వచ్చినట్టు అదే మాయోటైటిస్ వ్యాధి వచ్చిందట.దాంతో ఈ హీరోయిన్స్ అందరికి ఏమైంది ఒకేసారి ఇలా ఒకే రోగం బారిన పడుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీరేనా ఇంకా పలు కారణాలతో బయటకు చెప్పలేక ఈ రోగం బారిన పడిన వారు ఉన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube