నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్‘.
సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడగా ఇటీవలే సీజన్ 2 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి.
తాజాగా ఐదవ ఎపిసోడ్ ను నిన్న శుక్రవారం రిలీజ్ చేసారు.
దీంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ ఇద్దరు బడా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు కే రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి కూడా పాల్గొన్నారు.
వీరు ఈ ఎపిసోడ్ లో పాల్గొని అనేక విషయాలపై మాట్లాడారు.ముఖ్యంగా ఇద్దరు నిర్మాతలు టాలీవుడ్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు.
దీనిలో భాగంగానే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి కూడా వారి అభిప్రాయాన్ని తెలిపారు.సమంత ఇటీవలే యశోద సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకుంది.
ఈమె నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ భారీ వసూళ్లు కూడా సాధించి ఈమె స్టామినా తెలిపింది.మరి అలాంటి సమంతను మహానటితో పోల్చుతూ ఈ ఇద్దరు నిర్మాతలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

బాలయ్య ఈ షోలో ఈ ఇద్దరు నిర్మాతలకు తన ప్రశ్నగా ప్రెజెంట్ జనరేషన్ లో ఎవరు మహానటి? అని అడుగగా ఈ ఇద్దరు కూడా సమంత పేరునే రాయడం ఇప్పుడు క్రేజీగా మారిపోయింది.ఈమె ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సంతోషంగా ఉన్నారు.టాప్ నిర్మాతలే ఈమెను మహానటి అని ఒప్పుకున్న తర్వాత ఆమె కోసం ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన వాటిని పట్టించు కోవాల్సిన పని లేదు అనే చెప్పాలి.







