హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.థాయిలాండ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నానికి నిరసనగా ఆందోళనకు దిగారు.
ఈ మేరకు హెచ్సీయూ గేట్ వద్ద విద్యార్థులు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
థాయిలాండ్ కు చెందిన ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడగా బాధితురాలు తప్పించుకుంది.అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో థాయిలాండ్ యువతి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.







