వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిడదవోలులో ఇదేం కర్మరా.
మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ తప్పు చేయకపోయినా అమర్ రాజా బ్యాటరీస్ పై కేసులు పెట్టారన్నారు.
రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోయేలా చేశారని విమర్శించారు.తనపై కూడా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారన్నారు.72 శాతం ప్రాజెక్టును తానే పూర్తి చేశానన్నారు.వైసీపీ సైకోలను భూస్థాపితం చేసే వరకు తానుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.







